Header Banner

HDFC అదిరిపోయే స్కీమ్! రూ.10 వేల పొదుపుతో రూ.32 లక్షల ఆదాయం!

  Tue Feb 11, 2025 08:30        Business

స్టాక్ మార్కెట్ ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నా సరైన అవగాహన లేనివారు ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదు. పెట్టుబడికి సంబంధించిన ప్రాథమిక అంశాలు తెలుసుకోకుండా, మార్కెట్లపై అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడితే నష్టపోయే ప్రమాదం అధికంగా ఉంటుంది. చాలా మంది స్టాక్స్‌లో ప్రత్యక్షంగా పెట్టుబడి పెట్టడం కన్నా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. నిపుణులు సైతం మ్యూచవల్ ఫండ్స్‌ని సిఫారసు చేస్తుంటారు. కొత్తగా మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చే వారికి లార్జ్ క్యాప్ ఫండ్స్ సరైన ఎంపికగా మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు. ఇందులో నష్టభయం కాస్త తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ వస్తుంటాయి. 

 

అలాంటి కోవకే చెందుతుంది హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచవల్ ఫండ్ తీసుకొచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ లార్జ్ క్యాప్ ఫండ్. ఈ స్కీమ్ దీర్ఘకాలంలో హైరిటర్న్స్ అందించింది. గత రెండేళ్ల కాలంలో ఈ స్కీమ్ వార్షిక రాబడి 17.98 శాతంగా ఉంది. అలాగే గత మూడు సంవత్సరాల్లో 20.67 శాతం వార్షిక రాబడిని అందించింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో 23.56 శాతం చొప్పున రాబడులు అందించింది. ఇక గడిచిన 10 సంవత్సరాల కాలంలో చూస్తే ఈ స్కీమ్ ప్రతి ఏడాది సగటున 17.48 శాతం చొప్పున రిటర్న్స్ ఇచ్చింది. 

 

ఇది కూడా చదవండి: ఇలాంటి నీచమైన పనులు వైసీపీకి తప్ప మరెవరికి చేతకాదు! ఊరినే తాకట్టుపెట్టిన వైకాపా నేత.. వెలుగులోకి మరిన్ని నిజాలు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

హెచ్‌డీఎఫ్‌సీ లార్జ్ క్యాప్ ఫండ్ రిటర్న్స్ గమనిస్తే గత 10 సంవత్సరాల కాలంలో హైరిటర్న్స్ ఇచ్చింది. పదేళ్ల క్రితం ఈ స్కీమ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా నెలకు రూ.10 వేల చొప్పున పొదుపు కొనసాగిస్తున్నారు అనుకుందాం. 10 సంవత్సరాల నాటికి పెట్టుబడి మొత్తం రూ.12 లక్షలు అవుతుంది. దీనిపైన వార్షిక రాబడి 17.4 శాతంతో చూస్తే మొత్తం రూ.20.37 లక్షల వరకు వస్తుంది. అంటే మొత్తం చేతికి అసలు, వడ్డీ కలిపి రూ.32.37 లక్షలు అవుతుంది. 

 

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకుని ఉంటాయి. ఈ కథనం కేవలం అవగాహన కోసమే. ఎలాంటి పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కాదు. అన్ని వివరాలను తెలుసుకుని నిపుణుల సలహా మేరకే ఇన్వెస్ట్ చేయడం మంచిది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైఎస్సార్ జిల్లాలో భూకబ్జాల కలకలం.. వైకాపా నేతలపై కేసులు నమోదు! కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ!

 

ట్రాన్స్ జెండర్ ని ప్రేమించాడు.. తండ్రి సమాధి వద్దే.. చివరికి అతనికి జరిగింది ఇదే!

 

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ..

 

జగన్‌ను కుంగదీసే ఎదురు దెబ్బ.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై! శివరాత్రి నాటికి కీలక నిర్ణయం!

 

వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం! పూర్తి వివరాలు ఇవే!

 

చంద్రబాబు భారీ శుభవార్త.. కీలక ప్రకటనఈ నెల 12 వ తేదీ వరకూ! వెంటనే అప్లై చేసుకోండి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Business #savings #GovernmentSchemes #PostOffice